Sun Mar 15 2026 11:55:58 GMT+0530 (India Standard Time)
ఒడిశాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ట్రక్కును ఆటో ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ట్రక్కును ఆటో ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఒడిశాలోని డెంకానాల్ జిల్లాో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మైనర్ కూడా మరణించారని పోలీసులు తెలిపారు.
మృతులంతా...
మరణించిన వారంతా డెంకనాల్ జిల్లాలోని బంగూర గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఆటోలో ముక్తపేసి ప్రాంతానికి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

