Mon Dec 09 2024 08:12:33 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి.. మంచు కారణమా?
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో పన్నెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒడిశాలోని కెంఝహార్ జిల్లా 20వ నెంబరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని జీపు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది. మృతులంతా గంజాం జిల్లా నుంచి తారిణి దేవి ఆలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
గాయపడిన వారిని...
మృతుల్లో చిన్నారులతో పాటు మహిళలు కూడా ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అయితే పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story