Sun Mar 08 2026 09:01:13 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ముక్పాల్ రోడ్డు వద్ద ఉన్న 44వ నెంబరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. టైర్ కారు పేలిపోవడంతో బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని తెలుస్తోంది.
టైరు పేలడడంతో....
కారు టైరు పేలడడంతో గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కారు హైదరబాద్ నుంచి నిర్మల్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
Next Story

