Thu Mar 19 2026 22:07:50 GMT+0530 (India Standard Time)
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం... 11 మంది మృతి
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదకొండు మంది అక్కడికక్కడే మరణించారు

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదకొండు మంది అక్కడికక్కడే మరణించారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణికులతో వస్తున్న ఒక టవేరా ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. టవేరాలో ఉన్న వారిలో ఎక్కువ మంది మరణించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
నిద్రలో ఉండి ...
ప్రమాదం జరిగిన వెంటనే బేతుల్ జల్లా ఝల్లాల్ పోలీసులు సంఘటన స్థలికి వచ్చి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన వారిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని మరికొందరు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

