Thu Mar 19 2026 09:27:33 GMT+0530 (India Standard Time)
జమ్మూకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
జమ్మూకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు

జమ్మూకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. జమ్ము కాశ్మీర్ కిష్టవర్ జిల్లాలోని బోండా గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. రాష్ట్రంలోని చింగామ్ నుంచి చట్రూకు వెళుతున్న ఒక జీపు అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సంఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
మరో ముగ్గురి పరిస్థితి విషమం...
గాయపడిన ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అతి వేగమే ప్రమాద కారణమని పోలీసులు చెబుతున్నారు. వాహనంలో మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతం ప్రమాదాలకు నిలయమని స్థానికులు చెబుతున్నారు.
Next Story

