Mon Feb 02 2026 03:22:09 GMT+0000 (Coordinated Universal Time)
జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి
జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మరణించారు

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మరణించారు. పలువురు గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పూంఛ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూంఛ్ జిల్లాలోని సాజన్ ప్రాంతంలో మినీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
అతి వేగమే...
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు108 కు సమాచారం అందించారు. 20 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే మండీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వెంటనే సైన్యం చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది.
Next Story

