Sun Dec 08 2024 16:00:37 GMT+0000 (Coordinated Universal Time)
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం... ఏడుగురు మృతి
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గుజరాత్ లోని కృష్ణాపూర్ లో ఒక కారు బీభత్సం సృష్టించింది వేగంగా వచ్చిన కారు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయాల పాలయ్యారు.
పాదచారులపైకి....
గాయపడిన వారిని మాల్ పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అతి వేగంగా కారు దూసుకురావడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలికి పోలీసులు వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story