Thu Mar 19 2026 02:49:53 GMT+0530 (India Standard Time)
బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి
బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు

బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులు కృష్ణాజిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. వేమూరు జంపని దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. టాటా ఏస్ వాహనం బోల్తాపడటంతో నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు.
కృష్ణా జిల్లా వాసులుగా...
16 మందికి తీవ్ర గాయాలు కాగా, వారిలో ఒకరి పరిస్థిితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

