Thu Mar 27 2025 03:34:08 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 37 మంది స్పాట్ డెడ్
బొలివియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 37 మంది మరణించారు

బొలివియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 37 మంది మరణించారు. మరో నలభై మంది వరకూ గాయాలపాలయ్యారు. రెండు బస్సులు ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తన్నారు. అతి వేగంగా వచ్చిన రెండు బస్సులు ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉయుని, కొల్బాని రోడ్డుపై వెళుతున్న రెండు బస్సులను ఢీకొట్టాయి.
అతి వేగమే...
ఈ ప్రమాదంలో ఒక బస్సు వేగానికి అదుపు తప్పి లోయలోపడిపోయింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు దాదాపుగా మరణించినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. లాటిన్ అమెరికాలోని ఒరురో కార్నిాల్ కు వెళుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. సహాయక బృందాలు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి మృతదేహాలను వెలికి తీశాయి. మృతులను గుర్తించి వారి బంధువులకు అప్పగించే ప్రక్రియ ప్రారంభమమయింది.
Next Story