Mon Mar 23 2026 01:24:42 GMT+0530 (India Standard Time)
యాక్సిడెంట్.. 40 మంది మృతి
పశ్చిమాఫ్రికా దేశమైన సెనగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలభై మంది మరణించారు

పశ్చిమాఫ్రికా దేశమైన సెనగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలభై మంది మరణించారు. 78 మంది వరకూ తీవ్ర గాయాలపాలయ్యారు. రెండు బస్సులు ఢీకొట్టడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. సెనగల్ లో కఫ్రీన్ ప్రాంతంలోని నివీ గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రెండు బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసి పోయి ఉండటంతో మృతులు, గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
టైరు పంక్చర్ కావడంతోనే...
సెనగల్ లోని ఒకటో నెంబరు జాతీయ రహదారిపై రెండు బస్సులు ఢీకొన్నాయి. బస్సు టైర్ పంక్చర్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. గాయపడిన 78 మందిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం వైద్యాధికారులను ఆదేశించింది.
Next Story

