Fri Mar 20 2026 20:22:56 GMT+0530 (India Standard Time)
ఘోర ప్రమాదం : నలుగురు సజీవ దహనం
రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు

రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనతో అక్కడ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. రాజస్థాన్ అజ్మీర్ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు పెట్రోలు ట్యాంకర్లు ఢీకొట్టాయి. దీంతో రహదారిపై పెద్దయెత్తున మంటలు చెలరేగాయి.
ట్రాఫిక్ కు అంతరాయం...
ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయినట్లు గుర్తించారు. రాజస్థాన్ అజ్మీర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయినట్లు తెలిసింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు దహనమయిన పెట్రోలు ట్యాంకర్లను అక్కడి నుంచి తొలగిస్తున్నారు.
Next Story

