Mon Mar 23 2026 10:26:25 GMT+0530 (India Standard Time)
పాక్ లో ఘోర్ ప్రమాదం... 20 మంది సజీవదహనం
పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది సజీవదహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

పాకిస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది సజీవదహనమయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్ రాష్ట్రం ముల్తాన్ లో ఈరోజు ఈ ఘటన చోటు చేసుకుంది. లాహరో నుంచి కరాచీకి వెళుతున్న బస్సు హైవే పై ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. దీంతో బస్సు కు మంటలు అంటుకున్నాయి.
బస్సులో మంటలు...
ప్రయాణికులతో వెళుతున్న బస్సు కావడంతో అందులోని 20 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. సెకన్లలో జరిగిన ఈ ప్రమాదం నుంచి బయట పడేందుకు కూడా ప్రయాణికులకు వీలు లేకుండా పోయింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

