Wed Jan 21 2026 15:05:41 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం.. 13 మంది సజీవ దహనం
థాయ్లాండ్ నైట్ క్లబ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నైట్ క్లబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 మంది మరణించారు

థాయ్లాండ్ నైట్ క్లబ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నైట్ క్లబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 మంది మరణించారు. నలభై మందికి పైగా తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తూర్పు థాయ్లాండ్ లోని బోన్ బురి ప్రావెన్స్ లోని సత్తాహిస్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది.
మృతులందరూ...
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహలు గుర్తించడానికి వీలులేకుండా తయారయ్యాయి. సత్తాహిన్ జిల్లాలో మౌంటెన్ బి నైట్ క్లబ్ లో ఈ ప్రమాదం జరిగింది. మృతులందరూ స్వదేశీయులుగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
Next Story

