Sun Mar 26 2023 09:42:15 GMT+0000 (Coordinated Universal Time)
సికింద్రాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాంగోపాల్పేటలో ఈ ప్రమాదం జరిగింది.

సికింద్రాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాంగోపాల్పేటలో ఈ ప్రమాదం జరిగింది. డెక్కన్ నైట్ వేర్ స్టోర్ లో ఈ ప్రమాదం సంభవించడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. పొగ దట్టంగా వ్యాపించడంతో సహాయ కార్యక్రమాలను చేపట్టలేకపోతున్నారు. ఫ్యాబ్రిక్ మెటీరియల్ కావడంతో దట్టమైన పొగలు ఆ వీధి మొత్తం వ్యాపించి ఉన్నాయి. అయితే ఆస్తి నష్టం కోట్లలోనే సంభవించి ఉండవచ్చని చెబుతున్నారు. ప్రాణ నష్టం మాత్రం జరగలేదు.
నలుగురిని రక్షించిన...
అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఉదయం 10.30 గంటలకు ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. భవనంలో ఉన్న నలుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించగలిగారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది అనుమానిస్తున్నారు. మరికొన్ని గంటల సమయం మంటలను అదుపు చేయడానికి పడుతుందని అధికారులు చెబుతున్నారు.
Next Story