Wed Mar 18 2026 00:32:29 GMT+0530 (India Standard Time)
కేదార్నాథ్ లో కుప్పకూలిన హెలికాప్టర్.. 6గురి మృతి
ఉత్తరాఖండ్ కేదార్నాథ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు

ఉత్తరాఖండ్ కేదార్నాథ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టూరిస్ట్‌లతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడంతో ఆరుగురు మరణించారు. వాతావరణం అనుకూలించకే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మరణించిన వారిలో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులున్నారు.
సహాయక చర్యలు...
కుప్ప కూలి పోవడంతో మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా తయారయ్యాయి. మృతులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. సహాయక బృందాలు సంఘటన స్థలికి చేరుకుని చర్యలు ప్రారంభించాయి. ఈ విషాద సంఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు.
Next Story

