Thu Mar 19 2026 05:05:28 GMT+0530 (India Standard Time)
కాకినాడలో ఘోర ప్రమాదం : ముగ్గురు సజీవ దహనం
కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. రెండు లారీలు ఎదురుగా ఢీకొనడటంతో ఈ ప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి. లారీలో ఉన్న ముగ్గురు మరణించారు. ప్రత్తిపాడు మండలం ధర్మపురం సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. గురువారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు కాకినాడ జిల్లా పోలీసులు తెలిపారు.
లారీలు ఢీకొనడంతో...
రాజమండ్రి వైపు వెళుతున్న లారీని, కత్తిపూడి నుంచి వస్తున్న మరొక లారీ ఢీకొట్టడంతో పెద్దయెత్తున మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే లారీలో ఉన్న వారు మరణించడంతో ఎవరూ ఏమీ చేయలేకపోయారు. రెండు లారీలు ఒకదానికి ఒకటి ఇర్కోవడంతో వాటిని బయటకు తీయడానికి మరింత శ్రమించాల్సి వచ్చింది. మృతులు ఎవరనేది ఇంకా తెలియ రాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

