Fri Dec 05 2025 22:45:09 GMT+0000 (Coordinated Universal Time)
ఉత్తర్ప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. పడవ మునిగి 6గురు గల్లంతు
ఉత్తర్ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఇరవై మందికి పైగా వరద నీటిలో పడి పోయారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు.

ఉత్తర్ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఇరవై మందికి పైగా వరద నీటిలో పడి పోయారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఉత్తర్ప్రదేశ్ లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. ఘాజీపూర్ జిల్లాలోని అధహత గ్రామం ముంపునకు గురయింది. దీంతో ప్రజలను సురక్షితంగా బోటు ద్వారా బయటకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. డీజిల్ బోటు ద్వారా గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా పడవ గల్లంతయింది.
నీట మునగడంతో....
పడవ వరద నీటిలో మునిగిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఇరవై మంది మునిగిపోయారు. స్థానికులు కొందరు వెంటనే పన్నెండు మందిని రక్షించగలిగారు. మిగిలిన వారిలో ముగ్గురిని ఆసుపత్రికి పంపి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో ఇద్దరు మరణించారని అధికారులు వెల్లడించారు. ఆరుగురు గల్లంతయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారి కోసం గాలింపు చర్యలు మొదలయ్యాయి.
Next Story

