Mon Jul 04 2022 06:59:25 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో విశాఖ విద్యార్థి హత్య

అమెరికాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థి హత్యకు గురయ్యాడు. విశాఖపట్నంకు చెందిన సత్యకృష్ణను దోపిడీ దొంగలు కాల్చి చంపారు. విశాఖపట్నంకు చెందని చిట్టూరి సత్యకృష్ణ నెలరోజుల క్రితమే అమెరికా వెళ్లాడు. చదువుతో పాటు ఉపాధి అవకాశాలు వెతుక్కునేందుకు వెళ్లిన సత్య కృష్ణను దుండగులు డబ్బుకోసం కాల్చి చంపినట్లు తెలిసింది.
దోపిడీ దొంగల చేతిలో.....
దోపిడీ దొంగల చేతిలో హతమైన సత్యకృష్ణ విశాఖకు చెందిన వారు. సత్యకృష్ణ మృతితో వారి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. సత్యకృష్ణ మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని బంధువులు కోరుతున్నారు. ఈ ఘటనపై అమెరికా పోలీసులు విచారణ చేస్తున్నారు.
Next Story