Fri Dec 05 2025 17:42:51 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు నీటి గుంతలో పడి ఐదుగురు మరణించారు.

సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు నీటి గుంతలో పడి ఐదుగురు మరణించారు. జగదేవ్పూర్ మండలం మల్లన్న ఆలయంవద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మునిగడప మల్లన్న గుడి మలుపు వద్ద ఉన్న నీటి గుంటలో కారు పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
మొత్తం ఆరుగురు ప్రయాణిస్తుండగా...
కారు గుంతలో పడినప్పుడు మొత్తం ఆరుగురున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా మరొకరు మరణించారని పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఓవర్ స్పీడ్ కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

