Sun Mar 08 2026 09:01:14 GMT+0530 (India Standard Time)
ఘోర రోడ్డు ప్రమాదం : ముగ్గురు యువకుల మృతి
నిజమాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

నిజమాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఆగి ఉన్న లారీని కారు డీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆర్మూరు మండలం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
కొండగట్టుకు వెళుతుండగా...
మృతులు ముగ్గురూ నందిపేట్ మండలానికి చెందిన వారుగా గుర్తించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి దర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు సుభాష్ నగర్ కు చెందిన ఉమ్మడి అశోక, మంద మోహన్, రమేష్ లుగా గుర్తించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

