Sat Dec 06 2025 15:46:04 GMT+0000 (Coordinated Universal Time)
కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కడప జిల్లా చింతమడుగు మండలంలోని మద్దిమడుగు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు అరుగుపై కూర్చున్న వారిపైకి కారు దూసుకు వచ్చింది.
నలుగురికి తీవ్ర గాయాలు....
కారు బలంగా ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడం వల్లనే ప్రమాదం జరిగిందని, డ్రైవర్ మద్యం తాగాడా? లేదా? అన్నది పరిశీలస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

