Fri Jan 30 2026 22:52:22 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డు ప్రమాదం : ఇద్దరు భవానీ భక్తుల మృతి
తుని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. భవానీ భక్తులపై కారు దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.

తుని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. భవానీ భక్తులపై కారు దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. భవానీ భక్తులు విశాఖపట్నం నుంచి అనపర్తి వైపు వెళుతున్న కారు మితి మీరిన వేగంతో వచ్చి కాలినడకతో వెళుతున్న భవానీ భక్తులను ఢీకొట్టింది.
కాలినడకన..
దీంతో ఇద్దరు భవానీ భక్తులు మరణించారు. మృతులు ఈశ్వరరావు, సంతోష్ లుగా గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడం మండలం పెనసం గ్రామం నుంచి పాదయాత్రగా నలుగురు భక్తులు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పెనసం గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

