Sun Sep 15 2024 00:25:54 GMT+0000 (Coordinated Universal Time)
మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.
మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమారదం జరిగింది. భూత్పూరు మండలం తాటికొండ సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. బైక్ ను తప్పించ బోయి డీసీఎం కిందకు కారు దూసుకెళ్లడంతో ముగ్గురు మరణించారు.
ముగ్గురు హైదరాబాద్ వాసులే...
వీరు ముగ్గురు హైదరాబాద్ వాసులే. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జయింది. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story