Fri Dec 12 2025 06:01:10 GMT+0000 (Coordinated Universal Time)
ఓఆర్ఆర్ వద్ద ప్రమాదం.. ముగ్గురి మృతి
మేడ్చల్ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.

మేడ్చల్ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. తొమ్మిది మంది వరకూ గాయపడ్డారని తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వేగంగా వస్తున్న కారు లారీని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
డ్రైవర్ నిద్రమత్తులో...
డ్రైవర్ నిద్రమత్తులో ఉండి డ్రైవ్ చేస్తుండగా అదుపుతప్పి లారీని ఢీకొట్టినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. కారు శ్రీశైలం నుంచి మెదక్ వెళుతుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story

