Mon Mar 16 2026 17:46:32 GMT+0530 (India Standard Time)
గ్యాంగ్ రేప్ కేసును సీబీఐకి ఇవ్వాలంటూ హైకోర్టులో పిటీషన్
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు అయింది.

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు అయింది. ఉమా మహేంద్ర అనే సామాజికవేత్త ఈ పిటీషన్ దాఖలు చేశారు. పారదర్శక దర్యాప్తు కోసం ఈ కేసును సీబీఐకి ఇవ్వాలంటూ ఈ పిటీషన్ దాఖలయింది.
రాజకీయ నేతల కుటుంబీకులు.....
ఈ కేసులో రాజకీయ నాయకుల కుటుంబీకులకు సంబంధం ఉన్నందున కేసు దర్యాప్తు పారదర్శకంగా సాగదని పిటీషన్ అభిప్రాయపడ్డారు. సీబీఐతో దర్యాప్తు చేస్తేనే నిజాలు బయటకు వస్తేనే అసలు విషయాలు వెలుగు చూస్తాయని పిటీషనర్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. అందుకోసమే ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని ఉమా మహేంద్ర హైకోర్టులో పిటీషన్ దాఖలు ేశారు.
Next Story

