Sun Mar 08 2026 10:30:49 GMT+0530 (India Standard Time)
అమీర్ పేట్ లో గన్ కలకలం
అమీర్ పేట్ లో ఒక వ్యక్తి వద్ద గన్ పట్టుబడటం కలకలం రేపింది

అమీర్ పేట్ లో ఒక వ్యక్తి వద్ద గన్ పట్టుబడటం కలకలం రేపింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి ఒక వ్యక్తి గన్ తో పట్టుబడ్డారు. అతనిని సాయికుమార్ గా పోలీసులు గుర్తించారు. సాయికుమార్ అమీర్ పేట్ లో కొందరి వ్యక్తులతో గొడవ పడుతుండగా పోలీసులు వెళ్లి తనిఖీ చేయడంతో ఈ విషయం బయటపడింది.
ఆరు లైవ్ బుల్లెట్లు...
సాయికుమార్ వద్ద గన్ తో పాటు, ఆరు రౌండ్ల లైవ్ బుల్లెట్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిని వెంటనే పోలీసులు సాయికుమార్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సాయికుమార్ ను పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Next Story

