Thu Feb 05 2026 10:49:21 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురి మృతి
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.

తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ఆటోను కంటైనర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
అతి వేగమే...
చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతకంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా చెన్నైకి చెందిన వారుగా గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

