Tue Mar 17 2026 15:49:08 GMT+0530 (India Standard Time)
ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురి మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ ను కారు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ ను కారు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలం పి. కొత్తపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. కారు డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టడంతో కారులో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. స్థానికలులు వచ్చి కారులో నుంచి బాధితులను బయటకు తీసే సమయంలోనే వీరు చనిపోయారు.
కర్ణాటకకు చెందిన....
వీరంతా కర్ణాటకు చెందిన వారిన స్థానిక పోలీసులు చెబుతున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

