Sat Mar 07 2026 18:43:59 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటన జరిగింది.

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటన జరిగింది. ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. హైటెక్ సిటీ వద్ద ఈ ఘటన చోట చేసుకుంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
వనపర్తి జిల్లా వాసులుగా...
హైటెక్ సిటీ వద్ద ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మృతులంతా వనపర్తి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతులు రాజప్ప, శ్రీను, కృష్ణగా పోలీసులు మీడియాకు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

