Thu Sep 12 2024 13:12:02 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
ఢిల్లీలో పెద్దయెత్తున హెరాయిన్ పట్టుబడింది. నలభై కోట్ల విలువైన హెరాయిన్ ను సీజ్ చేశారు
ఢిల్లీలో పెద్దయెత్తున హెరాయిన్ పట్టుబడింది. నలభై కోట్ల విలువైన హెరాయిన్ ను సీజ్ చేశారు. ఇంత పెద్దమొత్తంలో హెరాయిన్ సీజ్ చేయడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు. మొత్తం పది కేజీల హెరాయిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.
అదుపులో ఇద్దరు....
అయితే ఈ కేసులో ఇద్దరు నిందితులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. హెరాయిన్ ను ఎక్కడి నుంచి తెచ్చారు? ఎవరికోసం తెచ్చారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story