Fri Mar 20 2026 05:45:19 GMT+0530 (India Standard Time)
35 కోట్ల హెరాయిన్ స్వాధీనం
రాజస్థాన్ లో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. మొత్తం 14 కిలోల హెరాయిన్ పట్టుబడినట్లు తెలిసింది.

రాజస్థాన్ లో భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. మొత్తం 14 కిలోల హెరాయిన్ పట్టుబడినట్లు తెలిసింది. దీని విలువ 35 కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. రాజస్థాన్ కు గత కొంత కాలం నుంచి హెరాయిన్ సరఫరా అవుతుందని భావించిన పోలీసులు అప్రమత్తమయ్యారు.
సరిహద్దుల నుంచి....
ముఖ్యంగా సరిహద్దుల నుంచి ఎక్కువగా ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. దీంతో రాజస్థాన్ పోలీసులతో పాటు బీఎస్ఎఫ్ సిబ్బందితో కలసి నిఘా ఏర్పాటు చేశారు. అయితే రాజస్థాన్ లోకి తరలిస్తున్న 14 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారని తెలిసింది.
Next Story

