Fri Sep 13 2024 02:44:04 GMT+0000 (Coordinated Universal Time)
3 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
కోల్ కత్తా ఎయిర్ పోర్టులో భారీ గా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెలుగు చూసింది
కోల్ కత్తా ఎయిర్ పోర్టులో భారీ గా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెలుగు చూసింది. మూడు కోట్ల విలువైన బంగారాన్ని ప్రయాణికులు విమానం ట్రాలీలో వదిలేశారు. అయితే దీనిని గమనించిన అధికారులు బంగారం ఎవరిదన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో దాదాపు ఐదు కిలోల బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించారు.
ట్రాలీ బ్యాగ్ లో....
కానీ బంగారం ఎవరిదన్న విషయం తెలీలేదు. దీంతో ప్రయాణికుల జాబితాను అనుసరించి ఆ ట్రాలీ బ్యాగ్ ఎవరిదన్న కోణంలో కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story