Sun Feb 01 2026 16:47:49 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈప్రమాదంలో ఆస్తి నష్టం భారీగానే జరిగింది

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి జరిగిన ఈప్రమాదంలో ఆస్తి నష్టం భారీగానే జరిగిందని చెబుతున్నారు. దాదాపు పద్దెనిమిది ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తేగలిగాయి. ఓల్డ్ సిటీలో ఈ ప్రమాదం జరిగింది. మూడు అంతస్థుల భవనంలో ఈ ప్రమాదం జరిగింది. ఎలక్ట్రానిక్ హోల్ సేల్ మార్కెట్ కు సంబంధించిన భవనంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదానికి కారణం...
ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? లేదా? మరే ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అన్న దానిపై ఆరా తీస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్తి నష్టం మాత్రం కోట్లలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు మంటలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పెద్దయెత్తున ముప్పు తప్పింది.
Next Story

