Wed Jan 28 2026 22:15:30 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడులో భారీ పేలుడు : ముగ్గురి మృతి
తమిళనాడు రాస్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. తిరుపూర్ జిల్లాలో బాణాసంచా తయారు చేస్తున్న ఇంట్లో పేలుడు జరిగి ముగ్గురు మరణించారు

తమిళనాడు రాస్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. తిరుపూర్ జిల్లాలో బాణాసంచా తయారు చేస్తున్న ఇంట్లో పేలుడు జరిగి ముగ్గురు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాణాసంచా గోదాములో ఈ పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే భారీగా పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి.
గాయపడిన వారిలో...
పేలుడు ధాటికి పది ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలిసింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కానీ గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని వైద్యులు సయితం చెబుతున్నారు. పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు.
Next Story

