Fri Dec 05 2025 18:00:03 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో భారీ పేలుడు
విశాఖపట్నంలోని ఆటోనగర్ లో భారీ పేలుడు సంభవించింది. ఒక టిఫిన్ సెంటర్ వద్ద ఈ పేలుడు జరిగింది

విశాఖపట్నంలోని ఆటోనగర్ లో భారీ పేలుడు సంభవించింది. ఒక టిఫిన్ సెంటర్ వద్ద ఈ పేలుడు జరిగింది. అయితే పక్కనే ఉన్న పాన్ షాప్ నుంచి ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పేలుడుతో టిఫిన్ సెంటర్ లో ఉన్న సామాగ్రి మొత్తం ధ్వంసమయింది. అక్కడే ఉన్న ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ప్రహరీ గోడ కూడా ధ్వంసమయింది.
అనేక అనుమానాలు...
పేలుడు సంభవించిన వెంటనే కొందరు పవర్ కట్ చేయడంతో ప్రమాదం మరింత తప్పింది. పేలుడు ఎందుకు? ఎలా? సంభవించింది అనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. గ్యాస్ సిలెండర్ పేలుడు అని తొలుత భావించినా తీవ్రత ఎక్కువగా ఉండటం, పాన్ సెంటర్ నుంచి పేలుడు రావడంతో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

