Thu Apr 02 2026 18:59:34 GMT+0530 (India Standard Time)
రెండు కోట్ల నగదు పట్టివేత
హైదరాబాద్ లో నగదు భారీ ఎత్తున పట్టుబడింది. రెండు కోట్ల రూపాయల హవాలా నగదును కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు

హైదరాబాద్ లో హవాలా నగదు భారీ ఎత్తున పట్టుబడింది. రెండు కోట్ల రూపాయల హవాలా నగదును కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12లో ఈ నగదును పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈ కారులో సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
హవాలా సొమ్ముగా...
అనంతరం కారు, నగదును వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారా పోలీసులకు అప్పగించారు. మునుగోడు ఉప ఎన్నిక జరుగుతుండటంతో పోలీసులు హైదరాబాద్ లో నిఘాను తీవ్రతరం చేశారు. ప్రతిరోజూ నగదు ఎక్కడో ఒకచోట పట్టుబడుతూనే ఉంది. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Next Story

