Sun Mar 15 2026 15:24:35 GMT+0530 (India Standard Time)
Breaking : పులివెందులలో కాల్పుల కలకలం
కడప జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడగా రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నా

కడప జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడగా రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. భరత్‌కుమార్ కు దిలీప్, మహబూబ్ భాషాల మధ్య ఆర్థిక లావాదేవీలున్నాయి. దిలీప్‌కు భరత్ కుమార్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో పులివెందుల బీఎస్ఎన్ఎల్ కార్యాలయం భరత్ కుమార్ దిలీప్‌కుమార్, మస్తాన్ భాషాలపై కాల్పులు జరిపాడు. దిలీప్, మస్తాన్ లు బావాబావమరుదులు.
డబ్బు విషయంలో...
దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. డబ్బుల విషయంలో జరిగిన గొడవే కాల్పులకు కారణమని చెబుతున్నారు. కాగా భరత్ కుమార్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ బంధువు. కాల్పులు జరిపిన అనంతరం భరత్ కుమార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మస్తాన్ మాత్రం ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారని తెలిసింది.
Next Story

