Thu Mar 19 2026 07:20:19 GMT+0530 (India Standard Time)
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
ఢిల్లీ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సుల్తాన్పూర్ లోని మురికివాడలో మంటలు చెలరేగాయి.

ఢిల్లీ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సుల్తాన్పూర్ లోని మురికివాడలో మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆస్తి నష్టం ఎక్కు జరిగింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు.
15 ఫైర్ ఇంజిన్లు...
అగ్నిప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే పదిహేను ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాయి. చివరకు మంటలను అదుపులోకి తెచ్చాయి. మంటలను చూసి స్థానికులు భయాంతదోళనలకు గురయ్యారు. రోబో లను కూడా మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది వినియోగించారు.
Next Story

