Sat Sep 07 2024 11:01:45 GMT+0000 (Coordinated Universal Time)
ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. భారీ నష్టం
శ్రీనగర్ లోని ఒక ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మృతుల వివరాలు తెలియరాలేదు
శ్రీనగర్ లోని ఒక ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మృతుల వివరాలు తెలియరాలేదు. భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశముంది. శ్రీనగర్ లోని బార్జుల్లాలోని బోన్ అండ్ జాయింట్ ఆసుపత్రిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
రోగులను తక్షణమే...
అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఆసుపత్రిలో రోగులు అధిక సంఖ్యలోనే ఉన్నారు. ఎమెర్జెన్సీ థియేటర్ లో ఈ మంటలు చెలరేగాయని చెబుతున్నారు. మంటలు వ్యాపించగానే వెంటనే రోగులను పక్కనే ఉన్న జేవీసీ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.
Next Story