Sat Mar 07 2026 14:07:15 GMT+0530 (India Standard Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థుల మృతి
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు.

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. పాఠశాలకు చెందిన బస్సును లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఉజ్జయిని జిల్లాలోని నగ్దా - ఉన్హేల్ రహదారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంలో పదకొండు మంది విద్యార్థులు గాయపడ్డారు.
అతి వేగమే...
గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఉజ్జయిని ఆసుపత్రికి తరలించారు. కాన్వెంట్ స్కూల్ బస్సు లారీని ఢీకొట్టడంతో వ్యాన్ నుజ్జునుజ్జయింది. అయితే అంబులెన్స్ సరైన సమయంలో దొరకకపోడంతో అటు వైపు వెళుతున్న బస్సులో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
Next Story

