Fri Dec 05 2025 21:36:31 GMT+0000 (Coordinated Universal Time)
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. నకరికల్లు మండంల శాంతినగర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. నాపరాళ్లతో మాచర్ల నుంచి భీమవరం వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది.
అతి వేగమే....
ఈ ఘటనకు అతి వేగమే కారణమని తెలుస్తుంది. నాపరాళ్లు మీద పడి లారీలో ఉన్న ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. కూలీలు పసర్లపాడుకు చెందిన అమారేసు శ్రీను, దొడ్డ భాస్కరరావు, రమావత్ మునినాయక్ గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

