Thu Mar 19 2026 13:13:49 GMT+0530 (India Standard Time)
Road Accident : రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఓ ట్యాంకర్ అదుపుతప్పి టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
అదుపు తప్పి...
ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. నల్లగొండ జిల్లా నిడమానూర్ మండలం వేంపాడు స్టేజి పక్కనే ఉన్న ఒక హోటల్ వద్ద ఆగిన టాటా ఏస్ వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. మృతులందరూ పెద్దపుర మండలం పుల్య తండాకు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

