Thu Feb 05 2026 02:03:17 GMT+0000 (Coordinated Universal Time)
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది మృతి
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు.

కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బస్సు ఆటోను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తాళ్ళరేవు బైపాస్ రోడ్డులో ప్రయాణిస్తుండగా.. ఆటోను ప్రైవేట్ బస్ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
ఆటోను బస్సు ఢీకొట్టడంతో....
మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని స్థానికులు తెలిపారు. బస్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయింది.. మృతదేహాలు చెల్లా చెదురుగా పడ్డాయి. ప్రైవేట్ బస్ ఢీ కొన్న సమయంలో ఆటోలో ఎనిమిది మంది ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆటోలో దాదాపు 15 మందిని ఎక్కించుకుని ప్రయాణిస్తుండటం కూడా తీవ్రతకు కారణమని చెబుతున్నారు.
- Tags
- road accident
Next Story
