Sun Mar 08 2026 01:30:08 GMT+0530 (India Standard Time)
ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్తుండగా ప్రమాదం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇల్లెందు - మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులూ...
మృతులందరూ హనుమకొండ జిల్లాల కమలాపూర్ కు చెందిన అరవింద్, వరంగల్ కు చెందిన రాము, కల్యాణ్, శివగా గుర్తించారు. లారీ వేగంగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. వీరంతా ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కసం భద్రాద్రి జిల్లా మోతె ప్రాంతానికి వెళుతున్నట్లు చెబుతున్నారు.
Next Story

