Thu Mar 19 2026 08:21:57 GMT+0530 (India Standard Time)
ఘోర రోడ్డు ప్రమాదం ... ఇద్దరు మహిళల మృతి
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మహిళలపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. పేరూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. ప్రాజెక్టులో జలకళను తిలకించేందుకు అక్కడకు మహిళలు వెళ్లారు. వేగంగా వచ్చిన లారీ మహిళలపై దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
పరారయ్యేందుకు...
మృతి చెందిన మహిళలను సరస్వతీదేవి, లక్ష్మీదేవిగా గుర్తించారు. అయితే లారీ డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే లారీతో సహా పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయితే స్థానికులు లారీని వెంబడించారు. కాల్వపల్లి సమీపంలో లారీని పట్టుకున్నారు. బెలుగుప్ప పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

