Fri Dec 05 2025 20:15:46 GMT+0000 (Coordinated Universal Time)
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురి మృతి
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా పె్ద వడుగూరు మండలం మిడుతూరు వద్ద ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ఇద్దరు, బస్సులో ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.
క్షతగాత్రులను....
ఈ ఘటనలో మరో పదిహేను మంది గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రమాదస్థలికివెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అనంతపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతుంది.
Next Story

