Thu Sep 19 2024 00:59:18 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తమిళనాడులోని తిరుపతూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్మికులతో వెళుతున్న వ్యాన్, లారీ ఢొకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అంబూర్ - వేలూరు హైవే పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, పది మందికి తీవ్రగాయాలయ్యాయి.
ఆరుగురి పరిస్థితి విషమం.....
తీవ్ర గాయాలయిన పదిమందిలో ఆరుగురి పరిస్థిితి విషమంగా ఉందని పోలీసుుల చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా షూ కంపెనీలో పనిచేసే కార్మికులుగా గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story