Sun Oct 06 2024 01:42:23 GMT+0000 (Coordinated Universal Time)
పొలాల్లో కుప్పకూలిన చాపర్.. ఇద్దరు మృతి
నల్లగొండ జిల్లాలో ఒక చాపర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్, ట్రైనీ పైలెట్ మృతి చెందారు
నల్లగొండ : నల్లగొండ జిల్లాలో ఒక చాపర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్, ట్రైనీ పైలెట్ మృతి చెందారు. నల్లగొండ జిల్లాలో పెద్దవూర మండలం తుంగతుర్తిలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలికి పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకున్నారు. చాపర్ కూలడం చూసిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. కుప్పకూలిన చాపర్ ట్రైనీదిగా చెబుతున్నారు.
నల్లగొండ జిల్లాలో....
పొలాల్లో చాపర్ కూలపోవడం చూసిన స్థానికులు భయపడి పరుగులు తీశారు. కొద్దిసేపటికి తేరుకుని అక్కడకు వెళ్లిన స్థానికులకు పైలెట్, కో పైలెట్ మృతదేహాలు కన్పించాయి. మాంసం ముద్దలుగా మారిపోయాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చాపర్ ఎటువైపు నుంచి వచ్చింది? ఎక్కడిది? అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇది ఒక ప్రయివేటు చాపర్ గా అధికారులు చెబుతున్నారు.
Next Story