Mon Feb 02 2026 06:14:40 GMT+0000 (Coordinated Universal Time)
పరారీలో టీడీపీ మాజీ మంత్రి కుమారుడు
పసిపిల్లల విక్రయం కేసులో మాజీ మంత్రి శనక్కాయల అరుణ కుమారుడు ఉమా శంకర్ పై కేసు నమోదయింది

పసిపిల్లల విక్రయం కేసులో మాజీ మంత్రి శనక్కాయల అరుణ కుమారుడు ఉమా శంకర్ పై కేసు నమోదయింది. ఉమాశంకర్ కోసం ఏలూరు నుంచి గుంటూరు వచ్చారు. పసిపిల్లల విక్రయం కేసులో ఉమాశంకర్ 11వ ముద్దాయిగా ఉన్నారు. ఉమాశంకర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సరగోసీ ద్వారా అప్పుడే పసిపిల్లలను విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
పసి పిల్లల విక్రయం కేసులో...
ఉమాశంకర్ ను అరెస్ట్ చేయడం కోసం ఏలూరు నుంచి స్పెషల్ టీం గుంటూరుకు వచ్చింది. గుంటూరులోని అహల్య నర్సింగ్ హోంలో అప్పుడే పుట్టిన పసి పిల్లలను విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో వారు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సంబంధం ఉన్న పది మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story

