Wed Jan 21 2026 04:27:32 GMT+0000 (Coordinated Universal Time)
తండ్రితో కలిసి ఈత నేర్చుకుంటూ.. 9 ఏళ్ల బాలుడు మృతి
మనోజ్ అనే బాలుడు ఈత నేర్చుకునేందుకు తన తండ్రితో కలిసి వెళ్లాడు. నీటిలోకి దిగి.. ఈత కొడుతుండగా..

తండ్రితో కలిసి ఈత నేర్చుకుంటుండగా.. తొమ్మిదేళ్ల బాలుడు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా ఎర్ర నాగులపల్లిలో చోటుచేసుకుంది. మనోజ్ అనే బాలుడు ఈత నేర్చుకునేందుకు తన తండ్రితో కలిసి వెళ్లాడు. నీటిలోకి దిగి.. ఈత కొడుతుండగా.. మనోజ్ నడుముకి కట్టిన బెండు ఊడిపోవడంతో.. నీటిలో మునిగిపోయాడు. స్థానికులు కొలనులో ఎంత వెతికినా మనోజ్ ఆచూకీ దొరకలేదు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వగా..వారు గాలించి మనోజ్ మృతదేహాన్ని బయటకు తీశారు.
సరదాగా ఈత నేర్చుకునేందుకు వెళ్లిన పిల్లాడు.. విగతజీవుడై ఇంటికి రావడంతో ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో.. పల్లెటూళ్లలో పిల్లలు చెరువులు, కాలువల వద్ద ఈత కొడుతూ సేదతీరుతుంటారు. ఈ క్రమంలో వారి అజాగ్రత్తే ప్రాణాలమీదికి తెస్తోంది. ఇటీవల అనకాపల్లిలో ఇద్దరు చిన్నారు ఈత సరదాకు బలయ్యారు. తెలంగాణలోనూ ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.
Next Story

